25-11-2025 04:34:42 PM
అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు..
వలిగొండ (విజయక్రాంతి): ఎన్నికల విధులలో అలసత్వం వహించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర రావు అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొని మాట్లాడుతూ రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ పోలింగ్ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, నిరంజన్, రాధకుమార్, సంయుద్దీన్, ఆలకుంట్ల శ్రీను పాల్గొన్నారు.