calender_icon.png 2 August, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక వేదనతో యువతి ఆత్మహత్య

02-08-2025 07:07:37 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నెన్నెల మండలం ఖర్జీ, జంగాలపేట, చెందిన యువతి ఉరివేసుకొని మృతి చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. నెన్నెల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్జీ గ్రామానికి చెందిన అద్దరపల్లి నాగేష్ పెద్ద కుమార్తె అద్దరపల్లి మమత(19) సంవత్సరం కిందట బెల్లంపల్లి గ్రామానికి చెందిన ఖాజా అనే వ్యక్తి నుంచి B.No TS 20 T 1162 గల ఆటోను మైలారం గ్రామానికి చెందిన మంచర్ల మల్లేష్ ద్వారా మమత కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆ ఆటోను మమత నడుపుకుంటూ ఉంది.

అయితే  నెల రోజుల కిందట ఆటోను ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్లారు. ఆటో అమ్మిన వ్యక్తిని ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకొని వెళ్ళారని చెప్పింది. ఆయన ఫైనాన్స్ కట్టలేదని చెప్పాడు. తాను డబ్బులు పూర్తిగా కట్టిన బండినీ ఫైనాన్స్ వాళ్ళు తీసుకువెళ్లడంతో నెల రోజుల నుంచి ఆటోను ఎలా తెచ్చుకోవాలనీ, డబ్బులు నష్ట పోయాననీ తీవ్ర మనోవేదనకు గురైంది. ఉపాధినిచ్చే ఆటోను కోల్పోయిన బాధలో మమత ఇంట్లో దూలానికి తాడుతో ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె లెటర్ లో రాసిపెట్టి సూసైడ్ చేసుకుంది. తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.