02-08-2025 06:57:16 PM
వర్ణ వెంకటరెడ్డి డిమాండ్..
హుజురాబాద్ (విజయక్రాంతి): దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర రైతు చట్టాలు తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి(Farmers Association State Vice President Varna Venkata Reddy) డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోస్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేదని విమర్శించారు.
రైతు ఉత్పత్తులకు శాస్త్రీయ మద్దతు ధరలు, విద్యుత్ సంస్కరణల చట్టంరద్దు, రెండు లక్షల వరకు రుణమాఫీ, యూరియా సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణ, పంటల బీమా అమలు వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో యూరియా కొరత కృత్రిమంగా సృష్టించారని, అధికారులు వ్యవహరించటం లేదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎం.వాసుదేవ్ రెడ్డి, వేలు రాజిరెడ్డి, గుండేటి వాసుదేవ్, శీలం అశోక్, జూనుతుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.