calender_icon.png 2 August, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ

02-08-2025 06:51:26 PM

దేశంలో, రాష్ట్రంలో బిజెపిని నిలువరించాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఆలస్యం..

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి..

సిపిఐ రాష్ట్ర మహాసభల వాల్  పోస్టర్ ఆవిష్కరించిన సిపిఐ నేతలు..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(CPI)కి వందేళ్ళ చరిత్ర ఉందని.. దేశంలో, రాష్ట్రంలో బిజెపి పార్టీని నిలువరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ రాష్ట్ర నాల్గవ మహాసభల వాల్ పోస్టర్ ను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ, సిపిఐ సంస్థ గత నిర్మాణంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర మహాసభలు పూర్తిచేసుకొని జాతీయ మహాసభలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని ఈ నేపథ్యంలో సిపిఐ నాల్గవ రాష్ట్ర మహాసభలు ఈనెల 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని, అనంతరం సెప్టెంబర్ లో పంజాబ్ రాష్ట్రంలోనీ చండీగఢ్ లో జాతీయ మహాసభలు జరగనున్నాయని ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నదని దేశంలో సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతుందని, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని ఉద్యమించిన పార్టీ సిపిఐ అని, భూమిలేని నిరుపేదలకు భూమి కావాలని, బెట్టిచాకిరి విముక్తి కోసం, రాజభరణాల రద్దు కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి లక్షలాదిమంది అమరవీరుల త్యాగాలతో కూడిన పార్టీ సిపిఐ అని అన్నారు. 

దేశంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పరిపాలన కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని కుట్ర పన్నుతూ దేశాన్ని హిందూ రాజ్యాంగా మార్చాలని ప్రయత్నం చేస్తుందని, దళితుల, గిరిజనుల, మైనార్టీల హక్కులను కాలరాస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగంలో కల్పించిన హక్కులను హరిస్తుందని, బిజెపి ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టేందుకు దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు, వామపక్షాలు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాదిన్నర గడిచిపోయింది కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని అమలు చేయడంలో వైఫల్యం కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదనీ, దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో సిపిఐ కలిసి ఉందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ గ్రామ, మండల, జిల్లా మహాసభలలో చేసిన తీర్మానాలను రాష్ట్ర మహాసభలో చర్చించి కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగా ఉంటూనే ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తామని, దేశంలో, రాష్ట్రంలో బిజెపిని నిలువరించేందుకు మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకొనున్నామని వెంకటస్వామి తెలిపారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,టేకుమల్ల సమ్మయ్య, బత్తుల బాబు,నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రామండ్ల పెల్లి యుగేందర్,మావురపు రాజు,బోనగిరి మహేందర్,బీర్ల పద్మ, కొట్టే అంజలి తదితరులు పాల్గొన్నారు.