calender_icon.png 2 August, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

02-08-2025 06:59:52 PM

చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం..

చండూరు (విజయక్రాంతి): సుశీలమ్మ ఫౌండేషన్(Susheelamma Foundation) ఆధ్వర్యంలో చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొరిమి ఓంకారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 50 సంవత్సరాలు పైబడిన వారిని కంటి పరీక్ష నిర్వహించి అదే రోజు బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేయిస్తారని, ప్రజలు సకాలంలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ మేడం హాజరవుతున్నారని వారు తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చె వారందరికీ భోజన సదుపాయం ఉంటుందని ఆయన అన్నారు.