02-08-2025 06:54:23 PM
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్..
కరీంనగర్ (విజయక్రాంతి): నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో వార్డు ఆఫీసర్లకు వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీస్కోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్(Municipal Commissioner Praful Desai) ఆదేశించారు. శనివారం నగరంలోని 10, 11 డివిజన్ లకు చెందిన వార్డు కార్యాలయాలను సంధర్శించి తనిఖీ చేశారు. సంబంధిత డివిజన్లకు చెందిన వార్డు కార్యాలయంలో నిల్వ చేసినా ఫర్నిచర్ సామాన్లను తొలగించి.. వాడుకలోకి తీస్కరావాలని అధికారులను ఆదేశించారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, 11,12 డివిజన్లలో కూడ వార్డు కార్యాలయాలను వాడుకలోకి తేవాలని కోరారు.
సప్తగిరి కాలనీ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంకు సొంత భవనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సప్తగిరి కాలనీ మహిళా భవనంలో మరో వార్డు సంబంధించిన ఆఫీసును ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. న్యూ శ్రీనగర్ కాలనీలో గల చిల్డ్రన్స్ పార్కులో చెడిపోయిన వాటర్ పౌంటెన్, జిమ్ము పరికరాలను మరమ్మతు చేసి ప్రజలకు వాడుకలోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కులో ఎలాంటి చిన్న చిన్న మరమ్మతులు ఉన్న వాటిని పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పోరేటర్ బుచ్చిరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.