calender_icon.png 1 January, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పినాకిల్‌లో 300 వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్

01-01-2026 12:14:42 AM

నేరేడుచర్ల, డిసెంబర్ 31: పట్టణంలోని కళల ఖజానా పినాకిల్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను బుధవారం వేడుకగా నిర్వహించారు.ఈ సందర్భంగా పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార్ మాట్లాడుతూ... భారతదేశంలోని ఆహార పద్ధతులు పల్లె, పట్నం ల పలుకరింత, పులకరింత, సామాజిక స్ధితి గతుల విషయాలు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, సామూహిక జీవనానికి, బహుళ సంస్కృతి కి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.

ప్రాంతీయ వైవిధ్యం, జీవవైవిధ్య సంరక్షణకు దోహదం చేస్తాయని, మట్టిలో తడిసిన చెమట పచ్చదనాన్ని వెన్ను వంచి అన్నం తీయగల అక్షరాల పూదోట పినాకిల్..ప్రక్రృతితో మెలగడం ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేకత అని అన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థులు 300 రకరకాల వంటకాలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలతో, ఆటపాటలతో అందరిని అలరించారు.

మరుగునపడిన కళలను, వ్రృత్తులను ప్రదర్శన ద్వారా ద్రృశ్య రూపకం గావించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్త్స్ర రవీందర్ నాయక్, పట్టణ ప్రముఖులు రాచకొండ రాంచందర్ రావు, పారేపల్లి శేఖర్ రావు, ఖాదర్, శ్రీలత, బాల వెంకటేశ్వర్లు, సరికొప్పుల నాగేశ్వరరావు, రాపోలు నవీన్, దేవి రెడ్డి నాగిరెడ్డి, పల్లెపంగు నాగరాజు, మధు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.