calender_icon.png 23 August, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

23-08-2025 06:25:50 PM

నేరాలకు ప్పడితే కటిన చర్యలు తప్పవు

నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యంతో పోలీసు శాఖ పటిష్టంగా పని చేస్తుంది

చివ్వెంల: పోలీసు స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహా ఐపీఎస్  ఈ రోజు చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. DSP ప్రసన్న కుమార్, CI రాజశేఖర్, SI మహేశ్వర్, సిబ్బంది ఎస్పికి స్వాగతం తెలిపారు. పోలీసు సిబ్బంది కవాతు, పోలీసు పరికరాలు తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకుని విధుల నిర్వహణపై సూచనలు అందించారు. పోలీసు స్టేషన్ అవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు అందించే పోలీసు సేవలు, నేరాల నమోదు, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల తీరు, కేసుల దర్యాప్తు, ప్రకృతి వైపరిత్యాలు సమయంలో పోలీసు కేసుల పురోగతి, సీసీ కెమెరాల అమలు, మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజల భద్రత, శాంతి భద్రతల రక్షణలో పటిష్టంగా పని చేస్తున్నాం, విధులు పట్ల ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఫిర్యాదులపై వేగంగా స్పందించి, న్యాయం అందించడంలో పారదర్శకంగా పని చేయాలని అన్నారు. పోలీస్ సిబ్బందికి ప్రేరణ కలిగిస్తూ, నైతిక విలువలతో కూడిన సేవను ప్రజలకు అందించాలని సూచించారు.