20-12-2025 05:19:23 PM
వంట గ్యాస్ తో ప్రమాదాలు నివారించండి.
హెచ్.పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ
పాల్వంచ,(విజయక్రాంతి): ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బొల్లిరిగూడెంలో వంట గ్యాస్ వాడకం పై, ప్రమాదాల నివారణపై శనివారం స్థానిక బొల్లోరు గూడెం ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్.పీ గ్యాస్ మేనేజర్ ఏ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల అధికారుల ఆదేశాల మేరకు ప్రతి హెచ్పీ గ్యాస్ వినియోగదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు పొందుటకు తప్పనిసరిగా ఈ- కేవైసీఈ చేయించుకోవాలన్నారు.
హెచ్పీ గ్యాస్ కార్యాలయం నుండి వచ్చు డెలివరీ బాయ్ మీ ఇంటి వద్దనే ఈ- కేవైసీ చేసి గ్యాస్ పైప్ తీసుకుని 2021 సంవత్సరానికి ముందు గ్యాస్ కలెక్షన్ తీసుకున్నవారికి 5 సంవత్సరాలు దాటిన వారికి అందరికీ రూ 190 రూపాయలు తీసుకొని పైపు బదిలాయించి మీ గ్యాస్ నెంబర్ కు హెచ్ పి గ్యాస్ ప్యాకేజీ లో పైపు తేదీని అప్డేట్ చేపడుతుందన్నారు. వినియోగదారుడు ఏ కారణం చేతైనా ఇంటికి, మా కార్యాలయం నుండి మెకానిక్ మాండేటరీ తనిఖీ చేయడానికి వచ్చి మీ వంట గదిలో ఏమి ఉండాలని, ఏమి ఉండకూడదని, గాలి వెలుతురు సరిగ్గా ఉందో లేదో వినియోగదారుడు వాడుతున్న రెగ్యులేటర్, సురక్ష పై, గ్యాస్ పొయ్యి ( స్టవ్ బాగుందాలేదా) మీరు వంట చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒకవేళ పైపు వినియోగానికి పనికిరాకుండా ఉన్న దానిని వినియోగ కాలపరిమితి అయిపోయిన దానిని బదిలాయించి కొత్త సురక్ష పైప్ బిగించుకోవాలన్నారు.
ఈ విధంగా తనిఖీ చేసినందుకు రూ 236 , సురక్ష పైప్ కొత్తది బిగించినటానికి రూ 190 చెల్లించాలని హెచ్.పి గ్యాస్ మేనేజర్ తెలిపారు. అనుకోకుండా గ్యాస్ లీకేజీ వలన ఏమైనా ప్రమాదాలు జరిగిన యడల కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థ హెచ్పీసీఎల్ నిబంధనల ప్రకారం వినియోగదారుడుకు జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా లబ్ది చేకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా రూ500 గ్యాస్ సిలిండర్ పొందాలన్నారు. మెకానిక్ ఇచ్చే సూచనలు పాటించి గ్యాస్ వల్ల జరిగే ప్రమాదాలు నివారించ గలరు.
ఈ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్ అధికారులు సూచించారు. లేనిచో మీకు గ్యాస్ సరఫరాకు ఆటంకం, అనుకోలేని ప్రమాదం ఏవైనా జరిగిన హెచ్.పీ గ్యాస్, పౌర సరఫరాల సంస్థ ఇటువంటి బాధ్యత వహించదన్నారు. ఈ కార్యక్రమంలో మెకానిక్ ప్రకాశ్, డెలివరీ బాయ్ సత్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీ, పీ. డి. శ్రీనరేష్, ఉపాధ్యాయులు చెన్నారావు, కిషన్, సురేశ్ అనూషా, గంగ, ఉష, లలిత, కళావతి, ఆదిలక్ష్మి, జ్యోతి అర్జున్ రావు లు పాల్గొన్నారు.