calender_icon.png 1 November, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

29-10-2025 07:30:53 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎసిఎంఓ పుర్క ఉద్దవ్ అన్నారు.బుధవారం తిర్యానీ మండలంలోని జెండా గుడా,భీంజిగూడ,బుగ్గ గూడ పాఠశాలలను సందర్శించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేస్తున్న నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు, దుస్తువులు, బెంచీల క్వాలిటీని పరిశీలించారు. విద్యా బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు,సలహాలు అందజేశారు.