calender_icon.png 1 November, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్యక్ష ఎన్నికల హింస.. టాంజానియాలో 700 మంది మృతి

01-11-2025 09:05:23 AM

డోడోమా: టాంజానియాలో చెలరేగిన నిరసల్లో 700 మంది మరణించారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల అనంతరం టాంజానియాలో(Tanzania election protestsమూడు రోజులుగా నిరసనలు చేలరేగాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దంటూ స్థానికులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమీయాకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. టాంజానియాలో ఇంటర్నెట్ అంతరాయం మధ్య నిరసనకారులు ఇప్పటికీ వీధుల్లోనే ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రధాన పోటీదారులు జైలు పాలయ్యారు.

అధ్యక్షురాలు సామియా సులుహు హసన్(president samia suluhu hassan) బుధవారం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, తన పార్టీలోని విమర్శకుల నోరు మూయించడానికి ప్రయత్నించారు. కానీ దార్ ఎస్ సలాం, ఇతర నగరాల్లో జనాలు వీధుల్లోకి వచ్చి ఆమె పోస్టర్లను చించివేసి, పోలీసులు, పోలింగ్ స్టేషన్లపై దాడి చేయడంతో గందరగోళం నెలకొంది. దీని ఫలితంగా ఇంటర్నెట్ షట్డౌన్,  కర్ఫ్యూ విధించబడ్డాయి. శుక్రవారం కూడా వాణిజ్య కేంద్రంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలిపింది.