29-10-2025 07:32:25 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో బుధవారం నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైద్య నారాయణ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఎం.రవి కుమార్ వైద్య నారాయణ చిత్రపటానికి పూలమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఎం.రవి కుమార్ మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణుల మూల పురుషుడు వైద్య నారాయణ అని పేర్కొన్నారు. ఇందులో నాయి బ్రాహ్మణ నాయకులు అంజయ్య, సుభాష్, లక్ష్మణ్, నరేష్ పాల్గొన్నారు.