calender_icon.png 1 November, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

01-11-2025 09:53:30 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై(Hyderabad-Vijayawada highway ) భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల రైలు వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. చిట్యాల వంతెన కింద నీరు వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ నుంచి నార్కట్ పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల మొంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.