calender_icon.png 1 November, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లో నీళ్లు నిలిచే.. రైతులకు కన్నీళ్లు మిగిల్చే

29-10-2025 07:30:25 PM

మొంథా తుఫాను ప్రభావం..

"అర్ధరాత్రి నుండి వర్షం.. అంతులేని నష్టం..‘ 

ఒరిగిన వరిసెండ్లు.. మునిగిన పత్తి 

పొంగిపొర్లుతున్న చెరువులు కుంటలు,.. రోడ్లకు కోతలు 

నకిరేకల్ (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షాలకు ఆరుగాలం శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఎడతెరపి లేకుండా కురిసిన అకాల వర్షం అంతులేని నష్టాన్ని మిగిల్చింది. నకిరేకల్ నియోజకవర్గంలో నష్ట తీవ్రత అధికంగా ఉందని రైతులకు వాపోతున్నారు. అకాల వర్షం తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, పట్టాలు నీట మునిగి ధాన్యం రాసులు తడిసి ముద్దాయ్యాయి.

అనేక గ్రామాలలో పిఎసిఎస్ కోపరేటివ్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరదనీరు కలవాలా పారుతున్న పరిస్థితి ఉన్నది. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అనేక గ్రామాల్లో పత్తి నీట మునిగిన పరిస్థితి ఉన్నది.  తీసిన పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద మ్యాచర్ రాక ఆగిన పరిస్థితి ఉన్నది.. పెట్టిన పెట్టుబడులు చేతిన కష్టం చేతికి వస్తుందో రాదో ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం  , అధికారులు స్పందించి చొరచూపి మ్యాచర్ తో సంబంధం లేకుండా  తడిచిన ధాన్యాన్ని తడిసిన పత్తిని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నకిరేకల్ నియోజకవర్గంలో అనేక చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి.

జిల్లాలో రెండో ప్రాజెక్ట్ అయిన మూసి నది నీటి కుండాల మారింది. 7 గేట్లు నాలుగు ఫీట్ల మేర పైకెత్తి 20,000 క్యూసీక్కులను నిటిని విడుదల చేశారు. కట్టంగూర్ పెద్ద చెరువు అలుగు పోస్తున్న పరిస్థితున్నది. నకిరేకల్ పెద్ద చెరువు నిండుకుండలా మారింది. ఇవే కాదు అనేక గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి పొంగిపొర్లుతున్న పరిస్థితి ఉన్నది. దీంతో అనేక గ్రామాల్లో నీటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది. దీంతో గ్రామాలలోకి వెళ్లే రోడ్లు గుంతల మయంగా మారి నీటి కోతకు గురై థ్వంసానికి.. ఈ అకాల వర్షం రైతులనే కాదు అన్ని రకాల వ్యాపారాలను నష్టం చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులని ప్రజలని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.