01-11-2025 09:07:37 AM
గద్వాల, (విజయక్రాంతి): గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో గల ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్(Government BC Boys Hostel)లో శుక్రవారం రాత్రి పుడ్ పాయిజన్ తో 53 మంది అస్వస్థతకు గురి అయి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సంఘటన తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy) ఆసుపత్రి ని సందర్శించి ఎవరు అధైర్య పడొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వ హాస్టల్ లో పుడ్ పాయిజన్ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.