calender_icon.png 11 May, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

10-05-2025 12:00:00 AM

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే9 (విజయ క్రాంతి): గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ డి వి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గంజాయి నిర్మూలనలో భాగంగా పోలీస్ అధికారులకు వేయింగ్ మిషన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగించిన, గంజాయి సరఫరా చేసినట్లు తెలిస్తే 8712670551 / 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.గంజాయి రహిత జిల్లా కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బిసీఐ రాణా ప్రతాప్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆసిఫాబాద్ ఎస్‌హెచ్‌ఓ బుద్దే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.