calender_icon.png 11 May, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

10-05-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

భీమారం (చెన్నూర్), మే 9 : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించేందుకే  భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని జిల్లా  కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం భీమారం మండలంలోని అంకుశాపూర్, కొత్తపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలలలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. 

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవే శపెట్టిన భూభారతి నూతన అర్.ఓ. ఆర్. చట్టంలో భాగంగా భీమారం మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసి భూసమస్యల సంబంధిత దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ నెల 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గ్రామ సభకు 2 రోజుల ముందే గ్రామాలలో ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచిన ట్లయితే పరిష్కరించేందుకు మరింత అవకా శం ఉంటుందని, గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు.

రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భీమారం తహశీల్దార్ సదానందం, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.