calender_icon.png 14 September, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

14-09-2025 09:58:53 AM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సతీమణి, శ్రీమతి గాదరి కమల పుట్టినరోజు సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, వేద మంత్రాలతో ఆశీర్వదించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. దీనితో తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.