calender_icon.png 14 September, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం

14-09-2025 10:26:09 AM

హైదరాబాద్: ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించట్లేదని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురు మృతదేహాలు ఇప్పటికీ వెలికి తీయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTRపేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని కేటీఆర్ విమర్శించారు. కాలేశ్వరంలోని సమస్యలకు ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపించిన కేంద్రం ఇప్పుడు ఎందుకు పంపట్లేదని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని కూడా ఎందుకు పంపలేదని.. తెలంగాణలో కాంగ్రెస్ ను బీజేపీ కాపాడుతోందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి ఖచ్చితంగా శిక్షపడేలా చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.