14-09-2025 09:57:15 AM
కరీంనగర్ (విజయక్రాంతి): సర్పంచ్‌గా, పాక్స్ చైర్మన్‌గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా నాలుగు దశాబ్దాల కాలం ప్రజా సేవ చేసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకొని, మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి చెందడం పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Former MP Boinapally Vinod Kumar) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కర్ర శ్రీహరి మృతి చెందారని, నిబద్ధత, నిజాయితీ కలిగిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వినోద్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా కోహెడ మండలం ప్రజానీకానికి కర్ర శ్రీహరి మృతి తీరని లోటు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెబుతూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.