విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
‘సదాశివపేట జీనియన్ స్కూల్‌లో క్రీడలపై ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రదర్శన’
సంగారెడ్డి, మార్చి 7(విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలని ప్రిన్సిపాల్ ప్రీతి పేర్కొన్నారు. సదాశివపేట జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన స్కూల్ ఎక్స్‌పోలో క్రీడ లపై ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రదర్శించారు. ఈ ప్రాజె క్ట్ విద్యార్థుల్లో క్రీడల ప్రాముఖ్యత, శారీరక దృఢత్వంపై అవగాహన పెంచుతుందని స్పష్టం చేశారు.
శారీరక విద్య ఉపాధ్యాయులు సాయి కిరణ్ మార్గదర్శకత్వంలో ఈ ప్రా జెక్ట్ ఏర్పాటు కాగా, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివా స్ విద్యార్థులను అభినందించారు.సైన్స్ టీచర్ రాణా ప్రతాప్ విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ పా ఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రదర్శనను ప్రశంసించారు. కరస్పాండెంట్ రఘు వర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్‌రె రెడ్డి, స్కూ ల్ ఎక్స్‌పో విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు.




