calender_icon.png 6 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు

06-09-2025 12:00:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లాలో శుక్రవారం గణేష్ మండపాల వద్ద ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డిలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన అనుచరులతో కలిసి సిరిసిల్ల రోడ్డు, తిలక్ రోడ్డు, గాంధీ గంజ్, సుభాష్ రోడ్ లలో వినాయక మండపాలలో గల వినాయకుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మద్నూర్ మండల కేంద్రంలోని సెట్ కార్ గణపతిని పలు మండపాల్లో మీ గణపతులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.