05-09-2025 11:19:53 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రముఖ పురో హిత కుటుంబానికి చెందిన అర్చకుడు సిహెచ్ శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ధీవిస్తున్న వీడియో వైరల్ చర్చినీయాoశoగా మారింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామానికి చెందిన శ్రీనివాస్ హైదరాబాదులో సీఎం దంపతులకు అర్చన చేస్తూన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లంపల్లిలోని మారుమూల గ్రామానికి చెందిన అర్చకులు శ్రీనివాస్ సీఎం దంపతులకు పూజలు చేయడమేంటాన్న చర్చ ఆసక్తిగా మారింది.
బెల్లంపల్లి చెందిన పూజారి శ్రీనివాస్ కు సీఎం వస్త్రాలు కూడా బహుకరించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు పూజలు చేసే అవకాశo శ్రీనివాస్ కు రావడం బెల్లంపల్లి పురోహితులు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. అయితే అర్చకుడు శ్రీనివాస్ హైదరాబాదు లోనే స్థిరపడ్డాడు. అక్కడే పురోహితo చేస్తున్నారు.