31-10-2025 12:00:00 AM
 
							బిచ్కుంద, అక్టోబర్ 30(విజయ క్రాంతి): కార్తీకమాసం పవిత్ర సందర్భంగా గురువారం బిచ్కుంద మండలంలోని దైవలశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శివాలయ దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ... కార్తీకమాసంలో భగవంతుని ఆరాధన చేయడం అత్యంత పుణ్యఫలదాయకమని, ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసంలో శివారాధన ద్వారా మనసుకు శాంతి, కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తాయని తెలిపారు. బిచ్కుంద పట్టణ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నాల్చర్ రాజు, సొసైటీ వైస్ ఛైర్మెన్ యాదవ్ రావు, డాక్టర్ రాజు, మాజీ సర్పంచ్ మారుతీ, సంజు దేశాయ్, చింతల్ ప్రకాష్, నాగేష్, నారం సాయి కుమార్ పాల్గొన్నారు.