calender_icon.png 31 October, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ కార్డ్ లేదా.. అయినా ఓటేయొచ్చు

31-10-2025 12:00:00 AM

  1. జాబితాలో పేరుంటే చాలు 
  2. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో,  అక్టోబర్ 30 (విజయక్రాంతి) : నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డ్ తప్పనిసరి కాదని జీహెఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండి, ఎపిక్ కార్డు అందుబాటులో లేనివారు భారత ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో దేనినైనా చూపిం చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు, ఎపిక్ కార్డుకు బదులుగా ఈ క్రింది ఫొటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తమ వెంట తీసుకురావాల్సి ఉంటుం ది, ఆధార్ కార్డు, బ్యాంకులు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ,ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్,డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డ్, భారతీయ పాస్‌పోర్ట్,ఫొటోతో కూడిన పెన్షన్ పత్రం, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు.

ఇలా.. దేనినైనా చూపించి తమ ఓటు హక్కు ను వినియోగించుకోవచ్చు ..ఓటు వేయడానికి ఓటరు జాబితాలో పేరు ఉండటం అత్యంత ముఖ్యమని, పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు పైన పేర్కొన్న కారుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని కమిషనర్ కర్ణన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.