19-12-2025 12:38:05 AM
మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 18: సర్పంచులుగా గెలవడంతోపాటు గ్రామంలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు సహాయ శక్తులుగా పనిచేయాలని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్,వార్డు మెంబెర్స్ ను మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి సన్మానించారు.
అధికార పార్టీని ఎదిరించి పోరాడి విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబెర్స్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందేందుకు కృషి చేసిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలకు మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.