సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి) మే 24: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహక్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషా పద్మినీ ఛాయా సమేత సూర్య నారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు.
అనంతరం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమా న్,శ్రీ రామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి,అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, ఘనపురం నరేష్, అర్చకులు భీం పాండే, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






