calender_icon.png 3 February, 2026 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేత

03-02-2026 01:06:13 AM

ఖానాపూర్/నిర్మల్, ఫిబ్రవరి ౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పార్టీ జిల్లా ఇన్చార్జి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కానప్పుడు పట్టణంలో మున్సిపల్ అంకుల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫార్లను పంపించేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని తెలిపారు. పార్టీ నేతలంతా సమిష్టి కృషితో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

నిర్మల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను జాబితా విడుదల 

నిర్మల్ మున్సిపాలిటీలో ఈనెల 11న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. నిర్మల్ పట్టణంలో మొత్తం 42 వార్డులగా రిజర్వేషన్ల ఆధారంగా అన్ని రాజకీయ సమీకరణాలను సర్వేలను జోడించి జాబితాలు ఖరారు చేయడం జరిగింది అని పార్టీ నాయకులు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీహరి రావు అప్పల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఖరారైన నేపథ్యంలో పార్టీ టికెట్టు రానివారు నిరాశ చెందవద్దని తప్పకుండా పార్టీకి వారి సేవలను వినియోగించుకోవడం అని తెలిపారు.