calender_icon.png 18 February, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు..

17-02-2026 12:39:30 AM

  1. అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఏకగ్రీవం చేయడం అభినందనీయం 
  2. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు హాది

మహబూబ్నగర్,ఫిబ్రవరి 16: మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్,  డిప్యూటీ మేయర్లను అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై జిల్లా ఎంఐఎం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మేయర్గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జి. మమత, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం పట్ల ఎంఐఎం జిల్లా అధ్యక్షులు హాది, ఇన్చార్జ్ జాబేర్,ఎంఐఎం కార్పొరేటర్లు, పట్టణ అధ్యక్షుడు సాదత్  తదితరులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హాది మాట్లాడుతూ పట్టణంలో నూతన ఆనవాయితీకి శ్రీకారం చుట్టుతూ, అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ని వారు ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్నగర్ నగర అభి వృద్ధికి, ప్రజాసేవకు ఈ ఎన్నికలు కొత్త దిశను చూపుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, నాయకులు తఖి తదితరులు ఉన్నారు.