calender_icon.png 5 August, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచాలి

05-08-2025 01:17:05 AM

రాష్ట్ర రెవెన్యూ సెక్రెటరీ డి.ఎస్. లోకేష్ కుమార్

వనపర్తి టౌన్, ఆగస్టు 04 : భూభారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ అదరపు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సెక్రెటరీ సోమవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 15న ఎల్.బి.స్టేడియం లో గ్రామ పరిపాలన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని, అందుకు అవసరమైన ఖాళీలు, రోస్టర్ తదితర ప్రక్రియ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కిమ్య నాయక్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో రెవెన్యూ సదస్సు సందర్భంగా 7648 దరఖాస్తులు వచ్చాయని,

వాటిని పరిష్కరించడానికి ఇప్పటి వరకు 8837 నోటీసులు జారి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 696 దరఖాస్తులను ఆమోదించి అప్డేట్ చేసినట్లు తెలిపారు . నిబంధనలు పాటిస్తూ మిగిలిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచుతామని తెలియజేశారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, పరిపాలన అధికారి భాను ప్రకాష్, డి. సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.