05-08-2025 01:17:40 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయావరణలో ప్రభుత్వం నుంచి మంజూరైన కుట్టు మిషన్లను ఎమ్మెల్యే మహిళలకు పంపిణీ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువచేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన హామీచ్చారు. గత ప్రభుత్వంలో నియోజ కవర్గం లో అభివృద్ధిపై నిర్లక్ష్యపూరితంగా వివరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 600 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తున్నని త్వరలో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శోభారాణి, ఇన్చార్జి ఎంపీడీవో రెహ్మాన్,మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, డైరెక్టర్లు శ్రీశైలం, నాయకులు జగన్, కేశవులు శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు