calender_icon.png 7 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

06-11-2025 12:57:57 AM

-ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం భోలక్ పూర్ ర్ డివిజన్లోని దేవుని తోటలో గల శ్రీ భవాని శంకర్ దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను చాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేడి సురేష్, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఆలయ కార్య నిర్వాణ అధికారిణి బీ. జ్యోతి, అన్నయ్య సిబ్బంది సురేష్, సైదులు, ఆలయ పండితులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.