07-11-2025 09:37:36 PM
డా. వడ్డెపల్లి, చెతన్ రావు, కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్
హనుమకొండ,(విజయక్రాంతి): మందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లాంగ్ ట్రాన్స్‌ప్లాంట్ జీవం తిరిగి ఇచ్చే వైద్య పద్ధతని డాక్టర్ వడ్డేపల్లి చేతన్ రావు అన్నారు. రోగుల దెబ్బతిన్న ఊపిరితిత్తుల ను మార్చి బ్రెయిన్ డెడ్ దాతల ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను మార్చి రోగులను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు అన్నారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రం యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... భారతదేశంలో ఈ రంగంలో ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధించబడిందన్నారు.
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రులు దేశంలోనే ప్రముఖ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రంగా దిగాయని, ఇక్కడ పల్మనరీ ఫైబ్రోసిస్, కప్డ్, బ్రాంకీక్‌టాసిస్, పోస్ట్-కోవిడ్ లంగ్ డ్యామేజ్ వంటి సంక్లిష్ట వ్యాధులకు విజయవంతమైన ట్రాన్స్‌ప్లాంట్లు నిర్వహించ బడ్డాయి అన్నారు. ఇందులో ఒక చారిత్రాత్మక ఘట్టంగా, యశోద ఆసుపత్రులు భారతదేశంలో మొదటిసారిగా పారాక్వాట్ వల్ల జరిగిన ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌కి విజయవంతమైన లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేశామన్నారు. మరో విశేష ఘట్టంగా, 12 సంవత్సరాల వయస్సు గల బాలుడు పారాక్వాట్ కారణంగా ఊపిరితిత్తుల నష్టం పొందిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా విజయవంతంగా లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ పొందాడన్నారు.
ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత సంరక్షణ చాలా ముఖ్యం ఇన్ఫెక్షన్ నియంత్రణ, క్రమం తప్పని ఫాలోఅప్‌లు, పునరావాసం మానసిక ప్రోత్సాహం, చాలా మంది రోగులు ఇప్పుడు సాధారణ జీవితానికి తిరిగి వచ్చి విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ అద్భుతాల వెనుక అవయవదానం అత్యంత ముఖ్యమైందని, ఒక్క దాత ఎనిమిది ప్రాణాలను రక్షించగలడన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయాలనే సంకల్పం తీసుకుంటే మరెంతోమందికి జీవనావకాశం లభిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమం భలే మంజునాథ్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హాస్పిటల్ సిబ్బంది సాయి, వెంకట మద్దు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.