06-11-2025 12:59:33 AM
కొత్తపల్లి, నవంబరు 5 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థి ఎస్ జి ఎఫ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల మహబూబా బాద్ జిల్లాలోని నెల్లికోడూరులో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ అండర్ -17 బాలుర ఆర్చరీ పోటీలలో పాఠశాలకు చెందిన కూన మాణికేశ్వర్ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీ లకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి న రేందర్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. జాతీయ స్థాయి పో టీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యా యామ ఉపాధ్యాయులుపాల్గొన్నారు.