02-07-2025 01:18:33 AM
కవాడిగూడ కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ
ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): క్రీడలు మానసికోల్లాసానికే కాకుండా శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ అన్నారు. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం కవాడిగూడ బిజెపి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ టోర్నీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రచన శ్రీ మాట్లాడుతూ క్రీడలు మానసికొల్లాసానికే కాకుం డా శారీరక దారుద్యంతో పాటు ఇతరుల పట్ల సత్సంబంధాలను పెంపొందిస్తాయన్నారు. యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ముషీరా బాద్ నియోజకవర్గం ఇన్చార్జి మల్లంపేట రమేష్ రామ్, రాష్ట్ర నాయకులు జి. వెంకటేశ్, పరిమల్ కుమార్, మాజీ కార్పొరేటర్, బిజెపి సీనియర్ నాయకుడు టి. రవీందర్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు దిలీప్ యాదవ్, బి రమేష్ బాబు, గంటా శ్రీనివాస్, ప్రభాకర్ గంగపుత్ర, శ్రీనివాస్, డి. కుమార్ గౌడ్, కృష్ణ హరి, బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు బి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.