23-01-2026 12:59:30 AM
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం కోర్టు కాంప్లెక్స్‌లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడాపోటీలను ముఖ్యఅతిథి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను చేకూరుస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రిట లాల్ చందు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్, బార్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం అధ్యక్షులు ముద్దం వెంకటేశం పాల్గొన్నారు.
ఈ పోటీలు మూడు రోజులు నిర్వహిస్తామని, విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, స్పోర్ట్స్‌అండ్‌కల్చర్ సెక్ర టరీ జైపాల్ నాయక్, లైబ్రరీసెక్రెటరీ నిట్టు పాండు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర్‌రెడ్డి, అంజన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జేపీ మహేందర్, శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.