23-01-2026 12:58:31 AM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, జనవరి 22 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంప్రతి వాహనదారుడు తమ వాహనాన్ని భద్రంగా.. బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమెల్యే ఆ ది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల (సడక్ సురక్ష అభియాన్) కార్యక్రమాన్ని వేములవాడ ము న్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో గురువారం జిల్లా రవాణా శాఖా ఆద్వర్యంలో ని ర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వి ప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మ హేష్ బీ గితే హాజరై ప్రారంభించారు.
ట్రా ఫిక్ సిగ్నల్ రంగులలాగా సిద్దం చేసిన బెలూన్లను, శాంతి కపోతాలను ఎగురవేసారు. రో డ్డు భద్రతకు సంబంధించిన స్టికర్లను వాహనాలకు అతికించారు.అనంతరం ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ తిప్పాపూర్ బస్ స్టాండ్ నుం డి కోరుట్ల బస్ స్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపారు.ఈ సందర్భంగా విప్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని స్పష్టం చేసారు. ప్రతి వాహ నదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పా టించాలని సూచించారు. రోడ్డు ప్రమాదం లో ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ కు టుంబం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వివరించారు.
ప్రతి వాహనదారుడు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ట్రా క్టర్ డ్రైవర్లు జాగ్రతగా నడపాలని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేముల వాడ కు వచ్చే రహదారులకు మరమ్మత్తు చేయిస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా పెట్రోల్ పో యవద్దని కోరారు. శివరాత్రి సందర్భంగా ఆ టో డ్రైవర్లు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుం చి వచ్చే యాత్రికులు, భక్తులను క్షేమంగా గమ్యం చేర్చాలని సూచించారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.
వాహనాలు అతివేగంగా నడపవద్దని, మొబైల్ చూస్తూ వాహనాలు నడపవద్దని, స్కూల్ ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్ళవద్దని సూచించారు. ఎక్కు వగా రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటో వారికి ఇబ్బంది అవుతుందని తెలిపారు. నో హెల్మెట్.. నో పెట్రోల్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయ పడిన వారిని మొదటి గంటలో దవాఖనకు తరలించిన వారికి రహవీర్ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.ఎస్పీ మహేష్ బీ గితే మాట్లాడారు. హై స్పీడ్,డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే ప్ర మాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తె లిపారు. పరిమితికి మించి ప్రయాణీకులను వాహనాల్లో తీసుకువెళ్ళవద్దని సూచించా రు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల, రోడ్డు ప్రమాదాల సమాచారం ఆటో డ్రైవర్లు ఇవ్వాలని పేర్కొన్నారు.కార్యక్రమం లో ఏఎస్పీ రుత్విక్ సాయి,ఆర్డీఓ రాధాభాయి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ రాకేశ్, సిరిసిల్ల,వేములవాడ డిపో మేనేజర్లు ప్రకాష్ రావు,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.