calender_icon.png 7 July, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాకాంబరి అలంకరణలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి

07-07-2025 01:20:59 AM

అమ్మవారిని వేలాదిమంది దర్శించుకున్న భక్తులు 

జడ్చర్ల, జూలై 6: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట (డాక్) ఐబి బంగ్లా సమీపంలో 44వజాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ షాడం మాసం తొలి ఏకాదశి, శాకంబరి ఉత్సవముల మహోత్సవం, పునర్వసు కార్తె పురస్కరించుకొని ఆదివారం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతను శాకాంబరి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజ, కుంకుమా ర్చన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు పంచామృత నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వేడుకలను దేవాలయ కమిటీ అధ్యక్షులు గో నెల నరేందర్, మహేశ్వరి, . విజయ్ కుమార్, గౌతమీ ప్రియాంక , సభ్యులు మిద్దె నాగరా జు, బుక్క శివకుమార్, యాదగిరి, శ్రీశైలం, మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.