21 April, 2026 | 3:50 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

తప్పుడు ర్యాంకులతో శ్రీచైతన్య, నారాయణ మోసాలు

23-04-2025 01:44 AM

డీజీపీకి ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాం తి): ‘జేఈఈ మెయిన్స్ ఫలితాలకు సంబంధించి ‘శ్రీచైతన్య’, ‘నారాయణ’ యాజమాన్యాలు తప్పుడు ప్రకటనలు ఇస్తూ,  విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఆయా సంస్థలపై చీటింగ్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి’ అని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణి కంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు మంగళవారం డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యా దు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థ నుం చి శివన్ వికాస్ టోష్నీవాల్ అనే విద్యార్థి (హాల్ టికెట్ నం: 250310 391420 ) 9వ ర్యాంక్ సాధించాడని, అలా గే సౌరవ్ అనే విద్యార్థి (హాల్ టికెట్ నం: 250310254844) 12వ ర్యాంకు సాధించారని పేపర్లలో ప్రకటన ఇచ్చిందని, శ్రీచైతన్య యాజమాన్యం కూడా శివన్ వికాస్ టోష్నీవాల్, సౌరవ్ పేర్లను, ర్యాంకర్లను వాడుకున్నదని, పత్రికల్లో రెండు సంస్థల యాజ మాన్యాలు ఆ ఇద్దరి పేర్లనే ప్రచారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

శ్రీచైతన్య విద్యాసం స్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా సినీతారలు అల్లు అర్జున్, శ్రీలీల వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించొద్దని విద్యాశాఖ ప్రకటన జారీ చేయాలన్నారు. గ్యార నరేశ్, వంశీవర్ధన్‌రెడ్డి, హరీశ్, రఘు ఉన్నారు.