16-08-2025 09:02:03 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర మార్కండేయ ఆలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారికి 50కి పైగా పిండి వంటలతో మహా పలహార భోగాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని వృత్తాంతం మరియు విశిష్టతను భక్తులకు తెలియజేసి ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది.