16-08-2025 08:59:14 PM
వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి..
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల (విజయక్రాంతి): శనివారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళవద్దని సూచించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కోరారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా నీటి నిల్వలు వల్ల దోమలు అధికమై వాటి ద్వారా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రభవించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు.
కాచి పడపోసిన నీటిని తాగాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు అరికట్టవచ్చు అన్నారు. కావున ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళవద్దని తడిచేతులతో కరెంటు బోర్డులు స్విచ్లు ముట్టుకోకూడదని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని కోరారు.