16-08-2025 11:28:52 AM
బాన్సువాడ, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అభ్యాస పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని(Sri Krishnashtami birthday celebrations ) పురస్కరించుకుని శనివారం పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణ వేషధారణ రాధా వేషధారణ గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొట్టుతూ పాఠశాల విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకున్నారూ. నృత్యాలు,చేస్తూ స్టెప్పులు వేస్తూ చిన్ని కృష్ణుడు చేసిన సరదా అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్యామ్, ఉపాధ్యా యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.