16-08-2025 11:10:14 AM
చేగుంట(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోచేగుంట తాసిల్దార్ శ్రీకాంత్ "బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ డ్యూటీస్ ప్రశంసాపత్రాని అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkat Swamy), మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా తాసిల్దార్ శ్రీకాంత్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. శ్రీకాంత్ మండలం వృత్తి ధర్మంలో భాగంగా అందించిన సేవలను గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందించి, వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా మంచి సేవలను ప్రజలకు అందివ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు తాసిల్దార్ శ్రీకాంత్ను ను అభినందించారు.