03-05-2025 12:23:55 AM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రాజేంద్రనగర్, మే 2: శ్రీ రామానుజాచార్య అందరికీ ఆదర్శంప్రాయమని, ఆయన చూపిన మార్గం అనుసరణీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శ్రీ భగవత్ రామానుజాచార్య 1008 వ తిరునాక్షేత్ర మహోత్సవం శంషాబాద్ మండలంలోని ముచింతల్ సమతా మూర్తి కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది.
శుక్రవారం రాత్రి ఆయన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తిరు నక్షత్రం మహోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అంతకుముందు గవర్నర్కు సమతా మూర్తి కేంద్రం ట్రస్టు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.