03-05-2025 12:23:00 AM
వృత్తి ఉపాధ్యాయుడు ప్రవృత్తి సమాజ సేవ
భద్రాద్రి కొత్తగూడెం,మే2 (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బాలు నాయక్ జాతీయ స్థాయిలో యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు లభించింది.
కిన్నెరసాని నందు ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ పరిరక్షకుడు బాలు నాయక్ కు జాతీయ స్థాయిలో ‘యంగ్ ఇండియన్ సేవ పురస్కారం‘ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి (ఐఎఎస్ )చేతుల మీదుగా అందజేసారు.బాలు నాయక్ చేస్తున్నా సామాజిక,పర్యావరణ పరిరక్షణకై చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసారు.
ఈ కార్యక్రమంలో ’ద మిషన్’ ఫౌండర్, సిఐ ఏడుకొండలు, టిజిఓ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య, కొల్లి పాండేషన్ కల్పన,వెంకట రెడ్డి, ఆదిత్య శ్రీరామ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా, స్పెషల్ ఆఫీసర్ టి.మధుకర్, ఏటిడిఓ చంద్రమోహన్, పాఠశాల హెచ్‌ఎం ఎల్.రామారావు, వార్డెన్ స్టాఫ్ సెక్రటరీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, భోదేనేతర సిబ్బంది తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.