05-11-2025 07:13:14 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవ, బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఘట్ కేసర్ పట్టణంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సాహిత వెంకటేశ్వర స్వామి గీతా మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆత్మబోధ పీఠధిపతి శ్రీసదానంద యోగీశ్వర్లు గీతా మందిర్ లో చతుర్మహస్య మౌన దీక్ష విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీమాత్ భగవద్గీత భక్త సమాజం భక్తులు జుమ్మేరాత్ బజారు మెహిదీపట్నం, ముసాపేట్, మల్లాపూర్, రాయరావుపేట్, దమ్మాయిగూడ, ఆత్మబోధ పీఠం శిష్యబృందాలు పాల్గొన్నారు.