calender_icon.png 8 July, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సూచీలలో అగ్రస్థానం

06-12-2024 02:21:08 AM

* పదేళ్ల ప్రగతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు-

* ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం 

* టైకాన్ సదస్సులో ప్రసంగించిన మాజీ మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ హ యాంలో జరిగిన పదేళ్ల ప్రగతి నుంచి ఇత ర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేరళలోని టైకాన్ సదస్సుకు గురువారం ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ తమ పాలనలో చేపట్టిన పారిశ్రామిక విధానాలు, సాధించిన ప్రగతి అనుభవాలను వివరించారు. రాష్ర్టంలో ఉపాధి కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు అదనపు హంగులు అద్దెలా ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని బలోపేతం చేశామని చెప్పారు.

అనేక ఆర్థిక సూచీలలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కేరళ ప్రముఖ కంపెనీ కిటెక్స్ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్న సమాచారం తెలుసుకొని.. ఒక్కరోజులోనే సంస్థ చైర్మన్‌ను కలిసి రూ.3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణకు రప్పించగలగడం అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు ఉపాధి కల్పన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు.