25-11-2024 11:45:12 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి రాజుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సుజాత ఈనెల 1న పాల్వంచ మున్సిపాలిటీకి బదలి అయ్యారు. దీంతో కామారెడ్డి ఇన్చార్జి కమిషనర్ గా డిపిఓ గిరిధర్ కు బాధ్యత లు అప్పగించిన నాలుగు రోజులల్లోనే మళ్లీ ఎంఈ. వేణు గోపాల్ కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. తిరిగి మళ్లీ కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీహరి రాజుకు అదనపు బాధ్యతలను అప్పగించారు.