calender_icon.png 10 September, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

10-09-2025 04:40:24 PM

హన్మకొండ (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారు. సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన త్యాగాలు మనం ఎప్పటికీ మరచి పోలేం అని యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాల్గొనాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షులు సురేందర్,కుమార్ యాదవ్, స్థానిక నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.