calender_icon.png 10 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

10-09-2025 04:48:17 PM

ఆలయ టికెట్లు ఇక ఆన్లైన్ లోనే..

ఆలయానికి 500 మీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ నిషేధం

పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

పెద్దపల్లి (విజయక్రాంతి): ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sree Harsha)తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. తదుపరి ఆలయ అభివృద్ధి కోసం తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) ఆలయ పరిసరాలను పరిశీలించారు. అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ లకు అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెలరోజుల్లోగా ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయం పరిసరాలలో 500 మీటర్లలోపు భూములలో నిర్మాణాలు గానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గాని చేయరాదన్నారు.

ఆలయ భవిష్యత్తు అవసరాల కోసం అందరు సహకరించాలని, జిల్లాలోని ఈ అతిపెద్ద ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఆలయ ప్రిన్సెస్ లో  రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ డివైడర్ లను నిర్మిస్తామన్నారు. ఓదెల ఆలయానికి సంబంధించి అన్ని రకాల టికెట్లను ఇక ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఒగ్గు పూజారుల కోసం ఆలయ టికెట్లపై ఆదాయాన్ని 25 శాతం నుండి 35 శాతానికి పెంచి అందించనున్నట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధికి పూర్తి పారదర్శకతో పని చేయాలని ఆయన పాలకమండలికి సూచించారు. ఆలయ అభివృద్ధికి పూర్తి వ్యవస్థీకృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఈవో, ఆలయ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.